నేను ప్రత్యేకం కానీ లోకంలోకి

 నేను ప్రత్యేకం కానీ లోకంలోకి

-శృంగవరపు రచన

పొగడ్తలు-తెగడ్తలు
దుఃఖాలు-సంతోషాలు
ఆదరణలు-నిరాదరణలు
అందాలు-అనాకారాలు
నిజాలు-నటనలు
కోపాలు-తాపాలు
అనుభూతులు-అనుభవాలు
స్పందనలు-ప్రతిస్పందనలు
ఆమోదాలు-విభేదాలు
అజ్ఞానాలు-విజ్ఞానాలు
స్వేచ్చలు-బానిసత్వాలు
రాతలు-చేతలు
ఈ భావవరణంలో
నేను ప్రత్యేకమని
తేలియాడుతున్న నేను...
నాబోటి వారు
ఉండరనే
భ్రమలో బ్రతికేస్తూ
ఈ నా ప్రత్యేక లోకంలో
నా మీద నేనే
జాలి కురిపించుకుంటూ
నన్ను నేనే
అభినందించుకుంటూ
నన్ను నేనే
విమర్శించుకుంటూ
ఇది సగటు జీవుల
ప్రత్యేక లక్షణమని
తెలుసుకుని
ఈ ప్రత్యేకలోకం నుండి
సాధారణత్వంలోకి
మరలడానికి
పయనమవుతున్నాను
ఈ పయనం
నా ప్రత్యేకత అనుకోకముందే!
* * *

Comments

Popular posts from this blog

Survival Protection Instinct

ఉద్యోగ పర్వంలో సగటు మనిషి

'చివరకు మిగిలేది' నవలా సమీక్ష