కొడుకు-తల్లి

 కొడుకు-తల్లి

-శృంగవరపు రచన


హర్లాన్ కోబెన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ లో ప్రముఖమైన నవల ‘హోమ్’ కోబెన్ నవలలు అన్నీ చదివేస్తే నేర మూలాల్లో కొన్ని పోలికలు ఉండటం పాఠకులు గమనించవచ్చు. ఇదే పోలిక ‘డ్రాప్ షాట్’,’హోమ్’ లో గమనించవచ్చు. రెండు నవలల్లో మోటివ్ తల్లి తన కొడుకును కాపాడుకునే క్రమంలో జరిగే హత్యలే. మైరాన్ సిరీస్ లో వచ్చిన ఈ నవల కూడా ఆసాంతం చదివించే నవలే.
16 ఏళ్ల క్రితం కిడ్నాప్ కు గురైన పాట్రిక్ మూర్,రైస్ అనే పిల్లల్లో ఒకడైన ప్యాట్రిక్ జీవించే ఉన్నాడన్న వార్త తెలియడంతో నవల ఆరంభమవుతుంది. ప్యాట్రిక్ తల్లిదండ్రులు నాన్సీ,హంటర్. రైస్ తల్లిదండ్రులు బ్రూక్ ,చిక్. ప్యాట్రిక్ కిడ్నాప్ కు గురయ్యాక అతని తల్లిదండ్రులు విడిపోయారు. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న మైరాన్,విన్ మొత్తానికి ప్యాట్రిక్ ను తిరిగి తీసుకురాగలుగుతారు. కానీ అతను ట్రౌమాలో ఉండటం వల్ల రైస్ గురించి ఏమి చెప్పలేకపోతాడు.
ప్యాట్రిక్ ను డిఎన్ ఏ టెస్ట్ ద్వారా అతనే ప్యాట్రిక్ అని స్పష్టం చేస్తారు. ఇక కిడ్నాప్ జరిగిన రోజు జరిగిన విషయాలను గమనిస్తే పొరుగువారు అయిన ఈ రెండు కుటుంబాల్లోని పిల్లలు అయిన ప్యాట్రిక్,రైస్ ప్లే డేట్ ఉండటం వల్ల బ్రూక్ ఇంట్లో ఆడుకుంటూ ఉంటారు.ఆ రోజు బ్రూక్ ఇంట్లో ఉండదు. ఆ సమయంలో ఆ పిల్లలను చూసుకునే ఆయాను బేస్మెంట్ లో కట్టేసి ఎవరో ఆగంతకులు వారిద్దరిని కిడ్నాప్ చేస్తారు. ఆ తర్వాత వారి ఆచూకీ గురించి ఏం తెలియకుండా ఉండిపోతుంది.
ఇది జరిగిన తర్వాత ఆయా కూడా కనిపించకుండా పోతుంది. తిరిగి వచ్చిన ప్యాట్రిక్ కొన్ని రోజుల తర్వాత రైస్ మరణించాడని చెప్తాడు.తమను కిడ్నాప్ చేసిన వారు తనను హింసించబోతుంటే రైస్ అడ్డుపడి మరణించాడని చెప్తాడు.ఎందుకో ప్యాట్రిక్ అబద్ధం చెప్తున్నాడని మైరాన్ భావిస్తాడు. ఆ తర్వాత ప్యాట్రిక్ ను వెంబడించినప్పుడు అతను ఓ అమ్మాయిని కలవడం గమనిస్తాడు. ఆ తర్వాత ప్యాట్రిక్,ఆ అమ్మాయి కలిసి కాలేజీలో చదువుకున్నారని స్పష్టం అవుతుంది.కిడ్నాప్ అయిన పాట్రిక్ ఎలా చదువుకున్నాడు అనే విషయం మీద ఇన్వెస్టిగేట్ చేస్తారు మైరాన్,విన్.
ఆ పిల్లలు తప్పిపోయిన సమయానికి ముందు నాన్సీ,చిక్ ల మధ్య మెసేజిలు ఉన్నాయని,వారిద్దరి మధ్య ఉన్న ఈ మెసేజీలను చూసిన నాన్సీ భర్త హంటర్ భార్యతో గొడవపడతాడు.అదే సమయంలో అతని గన్ బయట పడటం,తల్లిదండ్రులకు తెలియకుండా వారిని గమనిస్తున్న ప్యాట్రిక్ అక్క ఆ గన్ ను ఆ తర్వాత దాచడం చేస్తుంది. ఆ గన్ తీసుకున్న ప్యాట్రిక్ ప్లే డేట్ లో తెలియకపోవడం వల్ల షూట్ చేయడంతో రైస్ మరణిస్తాడు.
ఈ విషయం తెలుసుకున్న నాన్సీ వెంటనే అక్కడికి వచ్చి ఆ శవాన్ని ఎవరికి తెలియకుండా ఓ నదిలో పడేసి, ఒకవేళ ఈ విషయం బయట పెడితే ఆయాను అనుమానిస్తారని ఆమెను భయపెట్టి ఆమెను దేశం వదిలి వెళ్లిపోయేలా చేస్తుంది. తర్వాత భర్త సాయంతో కొడుకును అజ్ఞాతంగా చదివే ఏర్పాటు చేస్తుంది. దీనిని కిడ్నాప్ గా చిత్రీకరిస్తుంది. ఇక ఎంతో కాలం కొడుకును అలా అజ్ఞాతంగా ఉంచలేక ప్యాట్రిక్ ను బయటకు రప్పిస్తుంది.జరిగిన దానికి పశ్చాత్తాప పడిన ప్యాట్రిక్ చనిపోయే ప్రయత్నం చేస్తాడు. బ్రూక్ తనకు అతని పట్ల ఏ మాత్రం కోపం లేదని చెప్పి అతన్ని ఆ ప్రయత్నం నుండి విరమించుకునేలా చేస్తుంది.బాల్యంలో తెలియక చేసిన ఆ తప్పుకు ప్యాట్రిక్ కు శిక్ష పడదు. అలాగే నాన్సీని ఇన్వెస్టిగేట్ చేసినా పెద్ద శిక్ష ఆమెకు కూడా పడదు.
ప్యాట్రిక్ చేసిన తప్పు తెలియక చేసినది.కానీ తల్లిగా కొడుకు ఉన్నాడో,లేడో తెలియకుండా జీవించడం ఎంత కష్టమో తెలిసిన తల్లి అయిన నాన్సీ చేసింది తప్పని భావించిన బ్రూక్ నాన్సీని హత్య చేస్తుంది.ఎలా అయితే నాన్సీ అంత కాలం తన కొడుకు గురించి లోకానికి తెలియకుండా చేసిందో,అలాగే ఆమె గురించి కూడా లోకానికి తెలియకుండా చేసి తన బాధను తీర్చుకునే ప్రయత్నం చేస్తుంది బ్రూక్. ఇక్కడితో నవల ముగుస్తుంది.
మనిషి చేసే హత్యల్లో ఎవరో ఒకరిని రక్షించడానికి లేక తనను తాను రక్షించుకోవడానికి చేసే హత్యలే ఎక్కువ ఉండటం సహజం.సీరియల్ కిల్లర్ కథలకు నేర మూలాలను ఏవైనా సరే ఉండేలా చేయవచ్చు కానీ అవి కానీ వాటిలో భయం-భద్రత చుట్టూ తిరిగేలా రచయిత ఎక్కువ ప్రయత్నించి రాస్తాడు. అటువంటి నవలే ఇది.
* * *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ