ఏదో అనుకుంటావ్ కానీ!

                                 ఏదో అనుకుంటావ్ కానీ!

                                                    - శృంగవరపు రచన


సమాజమో పులి అని
అనుకుంటూ
దానికి దూరంగా
పరిగెడతావు
కానీ
పరిగెత్తే జంతువులనే
అది వేటాడుతుందని మర్చిపోతావు!
ఏది మాట్లాడితే
ఆ పులికి కోపం వస్తుందో అని
ఏం చేస్తే ఆ పులి
ఆగ్రహానికి గురవ్వాలో అని
ఎన్ని సార్లు ఆగిపోయి ఉంటావు!
ఒక్కసారి పరుగు ఆపి
నిలబడు
నీ కోసం!
నువ్వు చేసింది
తప్పో ఒప్పో
ఏదైనా సరే
దాని కోసం!
తప్పే అయితే దిద్దుకో
దిద్దుకోలేకపోతే ఒప్పుకో
అప్పుడు ఆ పులి
అనే నీ దృష్టి
మారిపోతుంది!
నువ్వో యోధుడు అని
జ్ఞప్తికి వస్తుంది!
నీ జీవితమైనా
నిలబడకపోతే
నీది కాదు!
పరుగు నీ నుండి నీ లోకే
కావాలి!
నీ గురించి
ఆలోచనలు-జడ్జిమెంటులు
రోజుల నుండి
వారాల వరకు
వార్తల మేతలు...
తాము మంచివారుమనుకోవడానికి
కొందరికి దొరికే
ఓ వస్తువు నీవు!
అంతే! అంతకు మించి
నీ ఉనికికి స్థానం ఏముంది!!
ఏదో అనుకుంటావు కానీ
నీ గురించి
ఆలోచించే
సమయం కన్నా
అది వ్యాపారమో
వార్తకు గ్రాసమో
అయ్యే అవకాశాల సంభావ్యత
తూచే లోకమే ఇది!
ఏదో నీ గురించి
వారికి కొత్తగా
తెలిసిపోయిందని
బాధ పడతావు కానీ
నువ్వు మంచి అనే
మెడల్ ఎప్పుడు ఎవరూ వేశారని?
నీకు నువ్వు వేసుకుంటూ
అదే అందరి ఆమోదంతో అనుకోవడం తప్ప!
నీ గురించి నువ్వేంటో
చెప్పుకునే ధైర్యమే నువ్వు!
నువ్వు జింకవే
అయితే
చేసేదేముంది
ఏదో అనుకుంటూ సాగిపో!
* * *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ