కన్నీటి చుక్క!
కన్నీటి చుక్క!
చెప్పలేని చెప్పుకోలేని
బాధల భారాల మధ్య
నలిగిపోయిన వ్యథనుండే
పుట్టిందో!
తప్పో ఒప్పో
అని ముందుకు దూకిన
దైన్యం నుండి
పుట్టిన మొండితనంకు
పుట్టిన చేదు ఫలాలకే
పుట్టిందో!
బలం లేని బలహీన
సున్నిత వ్యక్తిత్వంకు
ధైర్యమివ్వలేని
బంధాల వల్లే
పుట్టిందో!
అలవాటైన నలిగిన మనసు
భాషగా మారిపోయి
ఒలికిందో ఆ కన్నీటి చుక్క
ఎవరికి మాత్రం తెలుసు!
చెదిరిపోయి రూపం
కోల్పోయిన స్వప్నం
కొత్త రూపం
సంతరించుకోలేని
ధ్వంస ఆకృతి
వికృతానికి
పుట్టిందో ఎవరికి తెలుసు!
ఎవరికి చెప్పకుండానే
అజ్ఞాతంగా
చుక్కలుగా మారుతూ
ఇంకిపోతున్న
ఆ చుక్కలు
వేటికి సాక్ష్యాలు
కాకమునుపే
హృదయాన్ని
రాయిలా మార్చేస్తూ
మాయమైపోతున్నాయి!
* * *

Comments
Post a Comment