హిస్టిరియా

  హిస్టిరియా

- శృంగవరపు రచన

నిన్ను నువ్వు
మనిషి అనుకున్నప్పుడు
నీకు నచ్చని వారు
నచ్చేట్టు ఉండలేని వారు
మృగాలే అని అనుకోవడం
తప్పు కాదనుకుంటావు!
నీ ఊహలు
నీ నచ్చడాలు
నచ్చుకోవడాలు
తారుమారైనప్పుడు
నువ్వు హిస్టిరిక్
అవ్వడం నీకు
న్యాయ సమర్థింపు
అవ్వడం కూడా
నీకు
ఆశ్చర్యం కాదు!
కానీ అవే
నీ భావాలు
బలహీనతలు
ఆవేశాలు
ఆక్రోశాలు
ఎదుటివారికి
ఆయుధమైనప్పుడు
మాత్రం
నీ తెలివితక్కువతనాన్ని
తప్పిదాన్ని
అమాయకత్వంతో కప్పడం
నీ లౌక్యం అనుకోవడము
లోక రీతి అనుకుంటావు!
తప్పులు
లోకరీతులు
లౌక్యాలు
దాటితేనే
నీ లోని 'హిస్టిరియా'
మాయవుతుందని
ఒప్పుకోలేవు!
బాధ లోతుల్లో నుండి
ఆనందంలోకి
ప్రవహించే
తత్త్వం నీది
అని తెలుసుకోలేవు!
విక్టిమ్ గా ఉండటంలో
స్వీయ సానుభూతి
సమర్థింపు
నిన్ను నిజంగా
'హిస్టిరిక్' చేస్తున్నాయని
గుర్తించలేవు!
అపసవ్యతల్లో
సవ్యత వెతుక్కునే
స్థితిలో
ఉండేవారిలో
ఒకరివి నువ్వు!
* * *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ