అక్షర ద్వారం
అక్షర ద్వారం
కోట్ల అక్షరాలను తడుముతూ
వేల జీవితాల్లోకి ప్రవేశించాను
నేనేంటి అనుకున్న ప్రతిసారి
నా సామాన్యతను స్పష్టం
చేసే అక్షరాల్లో తలదాచుకున్నాను
వివాదాలను, ఉద్వేగాలను
సంతోషాన్ని, దుఃఖాన్ని, సంతృప్తిని
మోసే అక్షరాలతో
మమేకమైవుతూ
సేద తీర్చుకుంటూ
అక్కడే తిరుగాడాను
అపరిచిత వ్యక్తుల
ఆలోచనల్లోకి తొంగిచూస్తూ
పరిచితులతో బ్రతకడం
ఎలాగో నేర్చుకున్నాను
పొందని అనుభూతులను
దక్కని అనుభవాలను
అక్షరలోకంలో అనుభవిస్తూ
సంపూర్ణ స్వేచ్చతో
అక్షరాల్లో మునుగుతూ
ఎగురుతున్న
విహాంగాన్ని నేను!
* * *

Comments
Post a Comment