మార్పు పరిధి
మార్పు పరిధి -శృంగవరపు రచన (అన్వర్ గారి ‘జమీలా బాయి’ నవలా సమీక్ష) అన్వర్ గారి 'జమీలాబాయి' నవల స్త్రీవాద నవలగా నాకనిపించలేదు.'ఓ వేశ్య కాని వేశ్య' జీవితాన్ని ప్రభావితం చేసిన ఓ పురుషుడు ఇందులో ఉన్నాడు,ఆమె చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న సంకుచిత భావజాలం,మనిషి మంచితనానికి హద్దులు ఎందుకు ఏర్పడతాయో స్పష్టం చేసిన ఓ జీవన చిత్రం ఈ నవల. జీవితం గొప్పదా?మనిషి గొప్పవాడా? స్త్రీ గొప్పదా?పురుషుడు గొప్పవాడా?ఓటరు గొప్పవాడా?పాలకుడు గొప్పవాడా?వంటి ప్రశ్నలకు సిద్ధాంతపరమైన జవాబులకు,వాస్తవ కోణాలకు మధ్య వైరుధ్యముండే తీరుతుంది.ఎందుకీ వైరుధ్యత?ఎందుకు గొప్పతనాల ప్రదర్శనలు? అంటే మనిషి తన అవగాహన పరిమితి మేరకే తనను విస్తరించుకుంటూ,ఆ విస్తృతిలోనే అంతమైపోవడం వల్ల. ఆ విస్తృతి మనుషుల అహాలకు,విజయానుభవాలకు,పరాజయ ఉద్రేకాలకు చుట్టుకుని ఆ కేంద్రాన్ని దాటే మనుషులు,పరిస్థితులు ఎదురైనప్పుడు వాటికి దూరంగా పారిపోవడమో,లేక ఆ కొత్త పరిధిని కూడా కలుపుకోవడమో జరుగుతుంది.మనిషి జీవితంలో మూల మనస్తత్వాన్ని వారి విజయాలకనుగుణంగా మార్చుకున్నా సరే,మార్చగల మానసిక సత్తా ఉన్న మనుషులు ఎదురైనప్పుడు మారాల్సిందే,ఆ మార్పు ప్...