Posts

ఉద్యోగ పర్వంలో సగటు మనిషి

Image
      ఉద్యోగ పర్వంలో సగటు మనిషి                                                                                                       -శృంగవరపు రచన                                                           మ నిషి జీవితంలో కుటుంబాన్ని మించి ముఖ్య పాత్ర పోషించేది ఉద్యోగం.ఆశలతో తన జీవితాన్ని నిర్మించుకునే వ్యక్తికి జీవితపు అసలైన అర్ధాన్ని బోధపరిచేది ఉద్యోగమే.కుటుంబాన్ని ప్రేమించే మనిషికి బాధ్యతను నేర్పించేది ఉద్యోగమే.లోతుగా ఆలోచిస్తే వ్యక్తి తన కోసమే కాకుండా తన కుటుంబం కోసం పాటు పడే ధైర్యాన్ని ఇచ్చేది ఉద్యోగమే.ఈ సమాజంలోని మనుషులకు స్థిరమైన ఉద్యోగం లేకపోతే కు...

'వ్యాపార బంధాలు' నవలా సమీక్ష

Image
                                                            అవసరాల లోకంలో!                                                                                     -శృంగవరపు రచన                             మ నిషి బ్రతకడానికి డబ్బు అవసరం. డబ్బు లేకుండా ఏ పని జరుగదు. కానీ మనిషి ఆ అవసరం విషయంలో తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పడానికి సంకోచించడం ఎప్పటి నుండో జరుగుతూనే ఉంది. దానికి ముఖ్య కారణం డబ్బు కన్నా మానవ సంబంధాలు గొప్పవన్న భావన సమాజంలో ధృఢపడిపోవడం వల్ల. డబ్బు అవసరాల వరక...

సదాచారం దురాచారమయ్యే క్రమంలో!

Image
  సదాచారం దురాచారమయ్యే క్రమంలో!          -శృంగవరపు రచన                                                         ఎ న్నో సార్లు సమాజం మనిషిని అనేక రూపాల్లో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. వ్యక్తిగా సమాజంలో భాగం అయ్యే మనిషి తన జీవితంలో సమాజ ప్రభావం వల్ల సంతోషం కన్నా దుఃఖమే ఎక్కువగా ఉందని గమనించిన నాడు ఆ సమాజాన్ని లెక్క చేయకుండా బ్రతికితే తన జీవితం బాగుంటుందన్న భావనలో ఉంటాడు.అనేక సామాజిక సమస్యలు తలెత్తినప్పుడు మనిషి వాటిని ఎదుర్కునే క్రమంలో ఈ పద్ధతినే అవలంబించాడు. కానీ వ్యక్తికి సమాజాన్ని ఎదురీదే శక్తి ఎంత ఉన్నది అన్నదే ఆ అది దీర్ఘ కాలంలో ఆశయంగా నిలుస్తుందో లేకపోతే ఆ వ్యక్తిని సమాజమే మూకుమ్మడిగా నిర్వీర్యుడు అయ్యేలా చేస్తుందో అన్న విషయాన్ని నిర్ణయిస్తుంది. ఆ సమాజంలో పురుషుడితో సమానంగా స్త్రీ కూడా గుర్తింపు పొందుతున్నా  స్త్రీ కూడా అనేక సందర్భాల్లో తన జీవితాన్ని , అలవాట్...

'చివరకు మిగిలేది' నవలా సమీక్ష

Image
జీవితమే శూన్యమేమో!        -శృంగవరపు రచన                                    కొన్ని రచనలు చదువుతుంటే ఆ రచయిత బహుశా ఆ రచనా సృజన కోసమే జన్మించారేమో అన్న భావన కలుగుతుంది. బుచ్చిబాబు గారు రాసింది   ‘ చివరకు మిగిలేది ’ అన్న ఒక్క నవలే అయినా , ఇంకా తాను చెప్పదల్చుకున్నది అంతకు మించి ఉండదేమో అన్నంత తీవ్రమైన సంఘర్షణ , ఆలోచనలు , అనుభూతులు , అనుభవాలను జీవిత వలయంలో గిరగిరా తిప్పుతూ , వాటిని ఓ గమనింపుతో చూస్తూ , జీవితం గురించి ఏదో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ , జీవితం అంటే ఏమిటో తెలియని పరిస్థితుల్లో జీవిస్తూ , ఆ జీవితాన్ని జీవించడంలో సంతోషం లేదని , మనుషుల అనుబంధాలు-సంఘం కలిసి మనిషిలో జీవించాలనే కోరికను హత్య చేసే ప్రయత్నాన్ని గురించి , జీవితంలో చివరకు మిగిలేది ఏమి లేదని తేల్చడానికి రచన కథన పద్ధతి , సందర్భాలను , కథకుడి జీవితాన్ని , జీవితాన్ని ప్రభావితం చేసిన సంఘ నైతిక వలయాన్ని గురించి , జీవితానికి సంబంధించిన అనేక వాదనలను గురించి రచయిత రాసింది చదువుత...

జీవితమే అనుభూతుల విందు!

Image
                                   జీవితమే అనుభూతుల విందు!                                                                                 -శృంగవరపు రచన                                              క థల ప్రయోజనం లోతైన  అర్ధాల్లో ఏదైనా కావచ్చు కానీ జీవితంలో సంతోషమో లేదా దుఃఖమో ఏమున్నా సరే , మనకే తెలియని మనకు సంతోషాన్ని కలిగిస్తూ కొంత నవ్వును ముఖం మీద జమయ్యేలా చేసే కథలకు లోతైన విశ్లేషణలు అవసరం లేదు ఎందుకంటే అవి గొప్ప అనుభూతుల భాండాగారాలు కనుక! జీవితంలో మధుర స్మృతుల గురించి , కొన్ని అంశాలను తలచుకోగానే హాస్యం , సంతోషం ...

ముస్లిం జీవితం-భిన్న సామాజిక, వ్యక్తిగత కోణాలు!

Image
  ముస్లిం జీవితం-భిన్న సామాజిక , వ్యక్తిగత కోణాలు!          -శృంగవరపు రచన                                            ఈ ప్రపంచంలో మైనార్టీలుగా జీవించడం వాస్తవానికి నిరంతరం అభద్రతను కలిగిస్తూనే ఉంటుంది. ప్రజాస్వామ్య , మత సామరస్య దేశంగా చెప్పుకుంటున్న భారతదేశంలో గుజరాత్ లో 1992 డిసెంబర్ 6 న జరిగిన మారణకాండ , గోద్రా అల్లర్లో బలైన జీవితాలు ఈ దేశంలో ముస్లిం జీవితాల్లో ఉన్న దుఃఖాన్ని , వారి జీవించే హక్కు , గౌరవించబడే హక్కు హరించబడుతున్న విధానాన్ని స్పష్టం చేస్తూనే , ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తూ ఉంది. గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో పైన జరిగిన సామూహిక అత్యాచారంలో శిక్ష పడిన నిందితులను ఈ సంవత్సరం స్వాతంత్రదినోత్సవం నాడు విడుదల చేయడం , ఈ తీర్పుకి వ్యతిరేకంగా పిటిషన్ ఫైల్ చేసిన బిల్కిస్ భానో పిటిషన్ ను కోర్టు కొట్టేయ్యడం కూడా   మతం పేరిట జరిగే మారణకాండల పట్ల బాధితులకు ఇంకా భయాన్ని , అభద్రతను పెంచుతూనే ఉన్నాయ...

ఫతేపూర్ సిక్రీ మాయాజాలం

Image
    ఫతేపూర్ సిక్రీ మాయాజాలం                             -శృంగవరపు రచన                                                                     భారత దేశ చరిత్రలో అధికారం కోసం ఎన్నో యుద్ధాలు, అంతర్గత కలహాలు ప్రజాస్వామ్య ఆవరణ ఏర్పడేవరకు తలెత్తుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మొఘలుల కాలంలో అక్బర్, జహంగీర్, షాజహాన్ కాలంలో ఉన్న రాజకీయ, రాజ్య కుటుంబ యుద్ధ వాతావరణాన్ని భారతీయ రచయితల్లో బెంగాలుకు చెందిన ధీరేంద్రనాథ్ పాల్ గారు ‘మొగలాయి దర్బారు’ నవలలో చిత్రించారు. దీనిని తెలుగులోకి మొసలికంటి సంజీవరావు గారు అనువదించారు.ఈ  నవలను నేటి కాలం పాఠకులకు వ్యవహరిక బాషలోకి నేతి సూర్యనారాయణ శర్మ గారు అందుబాటులోకి తెచ్చారు.భారతీయ ఆంగ్ల రచయిత్రి ఇందు సుందర్శన్ గారు తాజ్ మహల్ ట్రయాలజీ రాశారు. అందులో నూర్జహాన్, ముంతాజ్ ,జహనారా కేంద్రంగా రాశారు. కానీ ‘మొగలా...