రాజు -టీచర్
సినీ సంచారం రాజు -టీచర్ -రచనశ్రీదత్త (శృంగవరపు రచన) ఎన్నో హాలీవుడ్ సినిమాలు నిజ జీవిత సంఘటనల ఆధారంగా తియ్యబడి ఆస్కార్లు గెలుచుకున్నాయి. అటువంటి కోవకు చెందిన సినిమానే 1956 లో వచ్చిన ‘The King And I.’ తొమ్మిది ఆస్కార్లకు నామినేట్ చేయబడిన ఈ సినిమా ఐదు ఆస్కార్లు గెలుచుకుంది. అన్నా లూయిన్స్ రాసుకున్న జ్ఞాపకాల ఆధారంగా మార్గరెట్ లండన్ 1944లో ‘Anna and the King of Siam’ అనే నవల రాసింది. అది అంతర్జాతీయ ప్రసిద్ధి పొందింది. ఈ నవల దాదాపు 20 భాషల్లోకి అనువదించబడింది. ఆ నవలనే వాల్టర్ లాంగన్ ‘ The King And I’ సినిమాగా రూపొందించాడు. అన్నా లూయిన్స్ ఓ ట్రావెల్ రచయిత్రి , టీచర్ మరియు సోషల్ యాక్టివిస్ట్ కూడా. సియామ్ రాజు (థైలాండ్ రాజు )మాంకట్ తన కొడుకులకు నాగరిక విద్యను బోధించాలనే ఆహ్వానం మ...