Posts

నిగ్రహ సాధన

Image
నిగ్రహ సాధన -శృంగవరపు రచన మనిషికి తెలిసి జరిగేవి, తెలియకుండా జరిగేవి, జరిగిపోతే తప్ప అర్ధం కానివి అని మూడు రకాలుగా జీవితం విభజించబడి ఉందో లేకపోతే మనిషికి తెలిసినా గుర్తించే చైతన్యం మనిషిలో లోపించడం వల్ల మనిషి మనశ్శాంతిని కోల్పోతున్నాడో తెలియని సంఘర్షణను ఆధ్యాత్మిక సాధన కోణంలో స్పష్టం చేయడానికి ప్రయత్నం చేసిన నవల శ్రీమతి శుభ గారి 'చిరుదివ్వెను వెలిగిద్దాం రండి!' ఈ నవలలో కాస్త సందిగ్దంగా జీవితం ఉన్నప్పటికి కూడా కొంతమేరకు ఆలోచింపజేసే ప్రయత్నం చేసిన నవల అది. ఈ నవలలో ముఖ్య పాత్రలు సుధీర,ఆమె స్నేహితురాలు మాధవి. సుధీర అన్నయ్య సౌజన్య. సుధీర తల్లిదండ్రులు వరలక్ష్మి,రామారావు.సుధీర కొంచెం దుడుకైన స్వభావం కల అమ్మాయి.ఓ రోజు మాధవితో కలిసి సినిమాకు వెళ్తుంది సుధీర. అక్కడ హాల్లో పోకిరి కుర్రాళ్ళూ నలుగురు వారిని అల్లరి చేసినప్పుడు సుధీర వారిలో ఒకతన్ని సూదితో గుచ్చుతుంది. ఆ తర్వాత హాలు బయట వారు అల్లరి చేసే ప్రయత్నం చేస్తే వారిని ఎదిరించి ధైర్...

చరిత్ర కథ పుటలు

Image
  చరిత్ర కథ పుటలు -శృంగవరపు రచన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన అరుదైన ఆరు తెలుగు నవలల్లో ఒకటి అంపశయ్య నవీన్ గారి ‘కాలరేఖలు.’1944 నుండి 1956 వరకు పదకొండవ ఆంధ్ర మహా సభ నుండి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవ్వటం వరకు ఉన్న తెలుగు రాష్ట్రాల పరిస్థితులను, ముఖ్యంగా నైజాం పాలనలో ప్రజలు పడ్డ బాధలను,అప్పుడు అవతరించిన ఆంధ్రమహాసభ వంటి సంస్థల చురుకైన పాత్రను,నాడు సమాజంలో ఉన్న సంప్రదాయాలను,మూఢ నమ్మకాలను, స్త్రీల జీవిత స్థితి గతులను,విద్య పట్ల ఉన్న అభిప్రాయాలను, నాటి కుటుంబ వ్యవస్థను,రాచరిక కుటుంబ వ్యవస్థలో ఉండే ఆచారాలను,మొత్తం మీద ఈ నవలను అటు స్వాతంత్ర్యం రాకముందు సమిష్టిగా ప్రజల కోణం నుండి, అలాగే వారి వ్యక్తిగత జీవితాల కోణం నుండి, ఆ సమయంలో ఉన్న స్త్రీల పరిస్థితులను కూడా స్పష్టం అయ్యే కోణంలోనూ, సంపూర్ణ పరిస్థితులను అక్షరీకరించేలా రాశారు రచయిత. ఈ నవలలో ముఖ్య పాత్ర రాజుది. అతని బాల్యంలో మొదలయ్యే ఈ నవల అతను మెట్రిక్ పరీక్ష రాయడంతో ముగుస్తుంది. ఈ మధ్య కాలంలో అతను ...

త్యాగోచిత పాత్ర

Image
  త్యాగోచిత పాత్ర -శృంగవరపు రచన సాహిత్యం కాలానికి ప్రతీక. ఆ కాలంలో ఉండే మార్పులకు సంకేతం. సాహిత్యంలో ఏది ఉంటే పాఠకులు చదువుతారని భావిస్తారో అలాంటి అంశాలను ఎన్నుకునే రచయితలు-పాఠకులు ఎలా ఉన్నారో కూడా స్పష్టం చేసే ఆయుధం. కానీ కొన్ని కథలు ఎప్పటికీ మారవు. కారణం ఆ కథలు అలా ఉండటంలో ఆ పాత్రలు ఏదో ఒక ఊహాజనిత ఆదర్శాన్ని అల్లుకుని,దానిలో నివసిస్తూ దాని నుండి బయట పడటం తమకు ముప్పు తెస్తుందేమో అన్న భయాన్ని త్యాగం పేరుతో కప్పిపుచ్చుకోవడంలో ఆ పాత్రలు ఒక రకమైన సంతోషాన్ని,సంతృప్తిని పొందుతాయి. 1980ల్లో వచ్చిన నవలల్లో దాదాపు ఈ రకపు సాహిత్యానికి ఆదరణ ఉన్నది. అవే కాస్త విస్తరిస్తూ నేటి సీరియల్స్ గా మారాయి అనుకుంటా. అటువంటి నవలే 1981 లో జ్యోతి అనుబంధ నవలగా వచ్చిన కరుణారుణ గారి ‘మలివెలుగు.’ ఈ నవల చదవమని,చదవవద్దని రెండు నేను సూచించను. కానీ సాహిత్యం మీద కన్నా కూడా రచయిత కథను నడిపే తీరులో మనం ఎన్నో అంశాలను గమనించవచ్చు. ఆ అంశాల్లో ఒకటి రచయిత తన కోసం రాస్తున్నాడా?లే...

అనుమానించబడిన మనిషి కథ

Image
  అనుమానించబడిన మనిషి కథ -శృంగవరపు రచన సగటు మనిషికి చాలా సార్లు తమ లక్షణాలే శత్రువులుగా మారతాయి. అందులో ఒకటి ధైర్యం లేకపోవడం,ఇంకొకటి ఒక సమస్య నుండి బయటపడాలనుకుని ఇంకో సమస్యలోకి దిగబడటం ముఖ్యమైనవి. వైవాహిక వ్యవస్థలో భార్యాభర్తలకు ఉండే స్వేచ్చ చాలావరకు ఆ ఇద్దరి ఆలోచనా పరిధిలో ఉన్న అర్ధం చేసుకునే తత్వం వరకే విస్తరిస్తుంది. ఓ అనుమానం కొన్ని జీవితాలను ఎలా నాశనం చేసిందో,వైవాహిక వ్యవస్థలో కొన్ని సార్లు పిరికితనం ఎలా తప్పు చేయడానికి పర్యాయ పదంగా పరిగణించబడే పరిస్థితుల్లో మనుషుల జీవితాలు ఎలా తారుమారు అయిపోతాయో,ఎలా నాశనం అవుతాయో స్పష్టం చేసే నవలే పాలకోడేటి సత్యనారాయణరావు గారి నవల ‘కొత్త తాళి.’ ఈ నవలలో ముఖ్య పాత్రలు మురళి,విజయ,సుజాత,రమణారావు. మురళి,విజయకు వివాహమవుతుంది. ఆ పెళ్లి అయ్యాక ఓ హస్తసాముద్రికుడు మురళి చెయ్యి చూసి అప్పటికే అతని జీవితంలో ఇంకో స్త్రీ ఉందని,ఒకవేళ లేకపోయినా భార్యతో ఉండే సంబంధం ఆమెతో కూడా ఉంటుందని చెప్తాడు. మనిషి ఏ విషయం ఎం...

‘మనం’ ఉన్న జీవితంలోకి

Image
  ‘మనం’ ఉన్న జీవితంలోకి -శృంగవరపు రచన మనం చేసే పనులకు మూలం ఏమిటి? మనం ఇష్టపడే అంశాలు ఏవి? మనం జీవించడంలో మన ఆలోచనలకు పనులకు మధ్య సమన్వయం ఎంత వరకు ఉంటుంది ? మనం చేసే పనుల్లో యాంత్రికత,భయం,బాధ్యత ఉన్నాయా లేక మనల్ని సూచించే మన ఇష్టాలు-అభిరుచులు ఉన్నాయా? మనం మన కోసం జీవించడం కోసం నిజంగా ఏం చేస్తున్నాము? ఏం చేస్తే మనం మన కోసం బ్రతకగలము? ఇన్నాళ్ల జీవితంలో మనకు ఏది ఇష్టమో,ఎందుకు ఇష్టమో అన్న అంశాలకు మనం ఏ మేరకు ప్రాధాన్యత ఇచ్చాము? మన ఇష్టాలు ఎలా జన్మించాయి? వాటి మీద మన ప్రభావం ఉందా? లేక సమాజం,కుటుంబం ప్రాధాన్యతలు వాటిని ప్రభావితం చేస్తున్నాయా? నిజంగా ఈ క్షణం మనం మన జీవితం మార్చుకోవాలంటే వేటిని వదిలించుకోవాలి? ఆ వదిలించుకోవడంలో మనల్ని మనం ఎలా వెతుక్కోవాలి? మనం చేయలేమనే న్యూనత లేదా మన మనసు పొరల్లో ఉన్న ఆదిక్యత వంటి భావనలను,అలాగే మన స్వరూపంలో తప్పులు చూసినప్పుడు వాటిని ఆమోదించలేని డినైల్ దశను ఎలా దాటాలి? భయాలను,ఇగో ఫీడ్ లను,అభద్రతలను వీటి నుంచి జన్మించే...

ఆ కొందరు!

Image
  ఆ కొందరు! -శృంగవరపు రచన జీవితంలో మన ఆలోచనలు,మన పరిస్థితులు,మన సమస్యలు,మన సుఖాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒకేలా ఉంటాయని అప్పుడప్పుడూ భ్రమ పడుతూ మనదన్న పరిధిని మనమే నిర్మించుకుని అందులో నివసిస్తూ ఉంటాము. ఎప్పుడైతే మనం మన పరిధిలో జీవితాన్ని ఒంటరిగా జీవించలేమని తెలుసుకుంటామో,అప్పుడు ఎవరో ఒకరు ఉంటే బావుండు అన్న భావన మనం మరలా మన పరిధిలో ఇమిడి పోయేవరకు అనిపిస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఆ కొందరు ఏదో ఒక దశలో ఉండే ఉంటారు. జీవితంలో ఆ కొందరి ప్రాముఖ్యతను స్పష్టం చేసే ఆంగ్ల నవలే సవి శర్మ రాసిన ‘Stories we never tell.’ ఈ నవలలో ఉన్న ప్రధాన పాత్రలు జాన్వి,ఆశ్రయ్. జాన్వి సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్. టీనేజ్ నుండి తన ఫోటోలు సోషల్ మీడియాల్లో పోస్టు చేసి సెలబ్రిటీగా ఎదిగింది.లైక్స్,ఫాలోవర్స్ మీద వచ్చే ఆదాయం,అవకాశాలే ఆమె జీవితం. ఆమె తల్లిదండ్రులు ఢిల్లీలో ఉంటారు. ఆమె ముంబై లో ఉంటుంది. ఆమె స్నేహితురాలు కావ్య.ఈ సోషల్ మీడియా లోకంలో మునిగిపోయిన ఆమెకు మూడు బ్రేకప్స్ అయ్యాయి. దానికి కారణం అవతలి వారు ఆమె తమతో ఇన్ వాల్వ్ కాకపోవడం అని స్పష్టం చేశారు. జాన్వి తనది కానీ వ్యక్తిగా లోకాన్ని మ...

జీవం ఉన్న జీవితంలోకి

Image
  జీవం ఉన్న జీవితంలోకి -శృంగవరపు రచన మనిషి తన జీవితంలో తనకు ఏది విలువైందో,ఏది కాదో ఎప్పుడు తెలుసుకుంటాడు? తనకున్న విలువైన ప్రతిభ తనలో అస్తమిస్తున్నప్పుడు దాని విలువ తెలిసి వస్తున్నప్పుడు దాని ప్రాధాన్యతను తన జీవితంలో ఎలా పెంచుకుంటాడు? మనిషి లోపల దాగి ఉన్న బాధ,అపరాధ భావం,ఎవరు లేని తనం నుండి జన్మించే మానసిక అపసవ్యతలు మనిషికి ఏం నేర్పిస్తాయి? మనిషి జీవితంలో తనకు అవసరం లేని వాటిని చేయనవసరం లేదని,మనిషి తనను గురించి తెలుసుకున్నాక ఎలా బ్రతకాలో,ఆ తెలుసుకోవడంలో కొన్ని సార్లు ఎన్ని అవరోధాలు దాటాలో స్పష్టం చేసే ఆంగ్ల నవల ప్రీతి షెనాయ్ రాసిన ‘Life is what you make it.’ ఈ నవలలో ముఖ్య పాత్ర అంకిత. అంకిత తల్లిదండ్రులకు ఒక్కర్తే కూతురు. ఆమె తండ్రికి బదిలీ అవ్వడం వల్ల కొచ్చిన్ లో వారితో కలిసి ఉంటుంది. ఆమె అంతకు ముందు ఢిల్లీలో ఉన్నప్పుడూ ఆమె స్నేహితుడు వైభవ్. అతనితో స్నేహం ఉన్నప్పటికి అది స్నేహామో,ప్రేమో ఆమెకు స్పష్టత లేదు.అంకిత తల్లిదండ్రులు మగపిల్లలతో...