ఫతేపూర్ సిక్రీ మాయాజాలం
ఫతేపూర్ సిక్రీ మాయాజాలం -శృంగవరపు రచన భారత దేశ చరిత్రలో అధికారం కోసం ఎన్నో యుద్ధాలు, అంతర్గత కలహాలు ప్రజాస్వామ్య ఆవరణ ఏర్పడేవరకు తలెత్తుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మొఘలుల కాలంలో అక్బర్, జహంగీర్, షాజహాన్ కాలంలో ఉన్న రాజకీయ, రాజ్య కుటుంబ యుద్ధ వాతావరణాన్ని భారతీయ రచయితల్లో బెంగాలుకు చెందిన ధీరేంద్రనాథ్ పాల్ గారు ‘మొగలాయి దర్బారు’ నవలలో చిత్రించారు. దీనిని తెలుగులోకి మొసలికంటి సంజీవరావు గారు అనువదించారు.ఈ నవలను నేటి కాలం పాఠకులకు వ్యవహరిక బాషలోకి నేతి సూర్యనారాయణ శర్మ గారు అందుబాటులోకి తెచ్చారు.భారతీయ ఆంగ్ల రచయిత్రి ఇందు సుందర్శన్ గారు తాజ్ మహల్ ట్రయాలజీ రాశారు. అందులో నూర్జహాన్, ముంతాజ్ ,జహనారా కేంద్రంగా రాశారు. కానీ ‘మొగలా...